Allu Ayaan : అల్లు అయాన్‌కి రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్.. సో స్వీట్ అంటూ బన్నీ..

ఇటీవల అల్లు అయాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా.. అనే సాంగ్ ని పాడాడు.

Allu Ayaan : అల్లు అయాన్‌కి రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్.. సో స్వీట్ అంటూ బన్నీ..

Shah Rukh Khan Reply for Allu Ayaan Song in Social Media Allu Arjun special Thanks to Shah Rukh Khan

Updated On : February 25, 2024 / 5:11 PM IST

Allu Ayaan : అల్లు అర్జున్(Allu Arjun) తనయుడు అల్లు అయాన్ చేసే సరదా పనులతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఇటీవల అల్లు అయాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా.. అనే సాంగ్‌ని పాడాడు. అల్లు అయాన్ పాడుతుండగా వీడియో తీసి స్నేహరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అల్లు అయాన్ మరోసారి వైరల్ అయ్యాడు. అయితే ఈసారి అయాన్ షారుఖ్ ఖాన్ దాకా వెళ్ళిపోయాడు.

సోషల్ మీడియాలో ఓ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఫ్యాన్ పేజ్ అల్లు అయాన్ షారుఖ్ సాంగ్ పాడిన వీడియోని షేర్ చేస్తూ.. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ షారుఖ్ సాంగ్ పాడాడు అంటూ పోస్ట్ చేశారు. దీనికి షారుఖ్ ని ట్యాగ్ చేయడంతో షారుఖ్ ఖాన్ రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ లిటిల్ వన్.. ఫ్లవర్, ఫైర్ రెండూ ఒకేదాంట్లో చూపించావు, ఇప్పుడు నా పిల్లలు శ్రీవల్లి సాంగ్ ప్రాక్టీస్ చేస్తారు అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేస్తూ పుష్పని గుర్తుచేశారు. దీంతో షారుఖ్ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Urvashi Rautela : బర్త్‌డే రోజు ఏకంగా 24 క్యారెట్ బంగారం కేకుని కట్ చేసిన హీరోయిన్

ఇక షారుఖ్ చేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.. షారుఖ్ జీ.. సో స్వీట్ ఆఫ్ యు.. మీ స్వీట్ మెసేజ్ కి థ్యాంక్యూ.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పోస్ట్ చేశారు. ఇంకేముంది అల్లు అయాన్ పాట పాడటం, దానికి షారుఖ్ రిప్లై ఇవ్వడం, దానికి అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడం.. మొత్తం సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే అయాన్ టాలీవుడ్ లో బాగా వైరల్ అయ్యాడు. ఇప్పుడు సినిమాల్లోకి రాకముందే అయాన్ బాలీవుడ్ దాకా వెళ్ళిపోయాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి అయాన్ పాడిన పాటతో బన్నీ – షారుఖ్ ట్వీట్స్ చేసుకున్నారు.