×
Ad

Nagababu : ఈ సీనియర్ డ్యాన్సర్, మెగాస్టార్ వీరాభిమాని గుర్తున్నారా..? నాగబాబు ఇచ్చిన మాటకు ఎమోషనల్..

ఇటీవల కొన్ని రోజుల క్రితం మురళి అనే ఓ పెద్దాయన తన డ్యాన్స్ లతో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. (Nagababu)

Nagababu

Nagababu : ఇటీవల కొన్ని రోజుల క్రితం మురళి అనే ఓ పెద్దాయన తన డ్యాన్స్ లతో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తిరుపతి పార్క్ లో చిరంజీవి పాటలకు వేసిన డ్యాన్సులు వేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఫేమ్ వచ్చింది. దాంతో మురళి ఢీ షోలో కూడా కనిపించారు.(Nagababu)

తాజాగా ఈటీవీ చేసిన దీపావళి ఈవెంట్ కి ఈయన్ని తీసుకొచ్చారు. తాజాగా ఈ ఈవెంట్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో మురళి అభి మాస్టర్ తో కలిసి చిరంజీవి సాంగ్స్ కి స్టేజిపై అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్ కి నాగబాబు గెస్ట్ గా వచ్చారు. మురళి డ్యాన్స్ కి ఫిదా అయిన నాగబాబు ఆయన చిరకాల కోరిక తీరుస్తా అని మాట ఇచ్చారు.

Also Read : TG Vishwa Prasad : అడ్వాన్స్ తీసుకొని బాబీ సినిమా చెయ్యట్లేదు.. చిరంజీవితో చేయాలి కానీ.. నిర్మాత వ్యాఖ్యలు..

మురళి డ్యాన్స్ చూసిన నాగబాబు.. చిరంజీవి గారిని ఎపుడైనా కలిసారా అని అడగ్గా.. లేదు కలవాలని నా కోరిక అన్నారు. దాంతో నాగబాబు.. నేను కలిపిస్తా. చక్కగా ఒక కాఫీ తాగి ఆయనతో ఒక ఫోటో తీసుకొని రండి. నేను మీకు ఇవ్వగలిగింది చిన్నది ఇదొక్కటే అని అన్నారు. దీంతో మురళి మోకాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

గతంలో పలు ఇంటర్వ్యూలలో మురళి.. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని అని, ఆయన పాటలకు వేసిన డ్యాన్స్ ల వల్లే నాకు పేరొచ్చిందని, ఆయన్ని జీవితంలో ఒక్కసారైనా కలవాలనేది నా కోరిక అని చెప్పారు. దీంతో ఈ సీనియర్ వీరాభిమాని కల నెరవేరబోతోంది అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ నాగబాబుని అభినందిస్తున్నారు.

Also See : Allu Sneha Reddy : బన్నీతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన అల్లు స్నేహ రెడ్డి..

ఈ దీపావళి ఈవెంట్ ప్రోమో మీరు కూడా చూసేయండి..