TG Vishwa Prasad : అడ్వాన్స్ తీసుకొని బాబీ సినిమా చెయ్యట్లేదు.. చిరంజీవితో చేయాలి కానీ.. నిర్మాత వ్యాఖ్యలు..
తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చిరంజీవి - బాబీ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(TG Vishwa Prasad)

TG Vishwa Prasad
TG Vishwa Prasad : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో డైరెక్టర్ బాబీ సినిమా కూడా ఉంది. ఆల్రెడీ బాబీ – చిరంజీవి కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మరో సినిమాని లైనప్ లో పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చిరంజీవి – బాబీ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(TG Vishwa Prasad)
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంది. ఎప్పట్నుంచో ట్రై చేస్తున్నాను. కొన్ని స్క్రిప్ట్స్ ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. డైరెక్టర్ – కథ కుదరట్లేదు. గతంలో డైరెక్టర్ బాబీకి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చాను. నాకు ఇంకా సినిమా చేయలేదు. ఆయన చిరంజీవి గారితో ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నాకు సెట్ అవుతుంది అనుకున్నాను కానీ బాబీ వేరే వాళ్ళతో చేస్తున్నాడు అది అతని ఇష్టం అని అన్నారు.
మరి దీనిపై బాబీ ఏమైనా స్పందిస్తాడా చూడాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి విశ్వప్రసాద్ కి. పవన్ కి బ్యాక్ గ్రౌండ్ లో చాలా సపోర్ట్ చేస్తారు. మరి మెగాస్టార్ తో సినిమా ఎప్పుడు తీస్తారో చూడాలి. ఇక మెగాస్టార్ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో రాబోతున్నారు. ఆ తర్వాత విశ్వంభర సినిమా, బాబీ తో ఒక సినిమా, శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా లైనప్ లో పెట్టారు.