Vishnu Priya : అమ్మకు క్యాన్సర్.. ఆ టైంలో ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని.. అమ్మ ఐసియులో నేను షూటింగ్ లో..

విష్ణుప్రియ తన కెరీర్ ఆరంభంలోనే పెళ్లి చేసుకున్నాను అని, తన తల్లి క్యాన్సర్ తో మరణించిందని అని పలు విషయాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.(Vishnu Priya)

Vishnu Priya : అమ్మకు క్యాన్సర్.. ఆ టైంలో ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని.. అమ్మ ఐసియులో నేను షూటింగ్ లో..

Vishnu Priya

Updated On : October 12, 2025 / 4:56 PM IST

Vishnu Priya : సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ ఆ తర్వాత సీరియల్స్ లోకి మారిపోయింది. గత కొన్నాళ్లుగా సీరియల్స్, టీవీ షోలతో బిజీగానే ఉంది. విష్ణుప్రియ తన కెరీర్ ఆరంభంలోనే పెళ్లి చేసుకున్నాను అని, తన తల్లి క్యాన్సర్ తో మరణించిందని అని పలు విషయాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.(Vishnu Priya)

విష్ణుప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్ ఆరంభంలోనే అమ్మకు క్యాన్సర్ వచ్చింది. మా అమ్మకు తన క్యాన్సర్ స్టేజెస్ అర్థమయి నా పెళ్లి చూసి చనిపోవాలి అనుకుంది. నేను అప్పుడే సిద్దుతో ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా సమయంలో ప్రమోషన్స్ లో బాగా కలిసి తిరగడంతో దగ్గరయ్యాము. అప్పుడప్పుడు ఇంటికి పికప్, డ్రాప్ కి వచ్చేవాడు. అప్పటికి మా మధ్య లవ్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓ రోజు సిద్ధూతో మా అమ్మకు క్యాన్సర్ అనే విషయం చెప్పి నాకు సంబంధాలు చూస్తున్నారు అని చెప్పాను. అంతే సిద్దు మా ఇంటికి వచ్చి.. ఇప్పుడు నేను అంతగా సంపాదించట్లేదు కానీ భవిష్యత్తులో మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, పెళ్లి చేయండి అని అడిగాడు.

Also Read : Sai Marthand : అయిదేళ్లుగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న హీరో.. హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న డైరెక్టర్?

నేనే షాక్ అయ్యాను. నాకు అసలు అతనికి ఈ ఉద్దేశం ఉందని కూడా తెలీదు. మా అమ్మ ఏమో నేను నిజంగానే లవ్ చేశాను అని అనుకుంది. మా నాన్నకు సిద్ధూ నిజాయితీ నచ్చి ఒప్పుకున్నారు. కానీ మా పెళ్లి జరగకముందే మా అమ్మ చనిపోయింది. చివరి రోజుల్లో మా అమ్మ ఐసియు లో ఉన్నప్పుడు కూడా నేను షూటింగ్స్ తో బిజీగా ఉండేదాన్ని. షూటింగ్ అయ్యాక ఎప్పుడో రాత్రికి వెళ్తే రాత్రి సమయాల్లో ఐసియులోకి పంపించేవాళ్ళు కాదు. చివరి రోజుల్లో అమ్మతో ఎక్కువ సేపు ఉండలేకపోయాను. అలా ఐసియులో ఉంటూనే చనిపోయారు.

మా అమ్మ చనిపోయిందని ఆమె కోరిక తీరాలని మా అమ్మ చనిపోయిన సంవత్సరంలోనే మా పెళ్లి జరిగింది. నా పెళ్లి సమయానికి నాకు 21 ఏళ్ళు. నా పెళ్ళికి నేను కొనుక్కునేవి అన్ని మా అమ్మ ఫోటో ముందు పెట్టి ఇవి కొన్నాను అని చూపించేదాన్ని. నాన్న కూడా రెండేళ్ల క్రితం చనిపోయారు అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Raviteja : రెడీ అవుతున్న రవితేజ బయోపిక్.. మాస్ మహారాజ పాత్రలో యూత్ యువరాజ..?