Sai Marthand : అయిదేళ్లుగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న హీరో.. హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న డైరెక్టర్?
ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి మార్తాండ. (Sai Marthand)

Sai Marthand
Sai Marthand : ఒకప్పుడు మంచి మంచి సినిమాలు, సూపర్ హిట్స్ చూసిన హీరో ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. అలాంటి హీరోతో హిట్ డైరెక్టర్ సినిమా తీయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి మార్తాండ. కేవలం రెండున్నర కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఏకంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది.(Sai Marthand)
దీంతో డైరెక్టర్ సాయి మార్తాండ్ కి తెగ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే జగపతిబాబు నిర్మాతగా మారి సాయి మార్తాండ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. సాయి మార్తాండ్ కూడా నా నెక్స్ట్ సినిమా జగపతి బాబు గారికే చేస్తాను అని చెప్పాడు ఆల్రెడీ.
Also Read : Aryan Khan : తండ్రి లాగే దూసుకుపోతున్న కొడుకు.. షారుఖ్ తనయుడి ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా?
అయితే తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం సాయి మార్తాండ్ హీరో నితిన్ కి కథ చెప్పాడట. నితిన్ తో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సాయి మార్తాండ్ తాజాగా నితిన్ కి కథ చెప్పాడని, నితిన్ ఇంకా ఏ విషయం చెప్పలేదని వినిపిస్తుంది.
నితిన్ చివరగా 2020లో భీష్మ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టలేదు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా పర్వాలేదనిపించింది. మిగిలినవి అన్ని ఫ్లాప్స్ చూసాడు. ఒకవేళ నితిన్ సాయి మార్తాండ్ చెప్పిన కథకు ఓకే చెప్తే జగపతి బాబు నిర్మాణంలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా సినిమా ఉంటుందని సమాచారం. మరి నితిన్ కి ఈ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా చూడాలి. ఇక నితిన్ చేస్తాడనుకున్న వేణు ఎల్లమ్మ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
Also Read : Raviteja : రెడీ అవుతున్న రవితేజ బయోపిక్.. మాస్ మహారాజ పాత్రలో యూత్ యువరాజ..?