Nagarjuna : 1000 ఎకరాలు దత్తత తీసుకుంటున్న నాగార్జున

ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి పార్కులను, అడవులను దత్తత తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని......

Nagarjuna :  ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా మొక్కలు నాటడం, నాటించడం చేస్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీలతో మొక్కలు నాటించి, వాళ్ళని ఇంకొకరితో నాటించేలా చేశారు. సెలబ్రిటీలతో కొన్ని మొక్కలని, పార్కులని, అడవులని దత్తత తీసుకునేలా కూడా చేశారు. తాజాగా నిన్న బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో సంతోష్ కుమార్ గెస్ట్ గా వచ్చారు.

Raashi Khanna : రాశీఖన్నా అందానికి సీక్రెట్ ఏంటో తెలుసా??

బిగ్ బాస్ కి గెస్ట్ గా వచ్చిన ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు. ఈ ఛాలెంజ్, మొక్కల గురించి మాట్లాడుతూ.. పచ్చదనమే రేపటి తరాలను కాపాడుతుందని, ఈ చాలెంజ్‌ ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జునకి ఒక మొక్కని బహూకరించి బిగ్‌బాస్‌ హౌస్‌లో నాటమని అన్నారు. అంతే కాక గత మూడు సంవత్సరాలలో 16 కోట్ల మొక్కలు నాటామని ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు.

Allu Arjun : స్పెషల్ సాంగ్ చేసినందుకు సమంత కి థ్యాంక్స్ చెప్పాలి

ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి పార్కులను, అడవులను దత్తత తీసుకున్నారని తెలిపారు. హీరో ప్రభాస్‌ 1650 ఎకరాలు దత్తత తీసుకుని దాన్ని హరితవనంగా మార్చేందుకు సిద్ధపడ్డారని, శర్వానంద్ ఒక పార్కుని దత్తత తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్ సిద్ధమని తెలిపారు. నాగ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు ప్రశంశిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు