Naa Saami Ranga Twitter Review : నాగార్జున ‘నా సామిరంగ’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

నాగార్జున ‘నా సామిరంగ’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ చూసిన ఆడియన్స్ ఏం చెబుతున్నారు.

Nagarjuna Allari Naresh Naa Saami Ranga movie Twitter Review

Naa Saami Ranga Twitter Review : నాగార్జున ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు చేస్తుండగా, హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటించారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీకి రీమేక్ గా వస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. నేడు జనవరి 14న ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా చూసిన వారు సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలను ఇస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు. ఇంట్రో ఫైట్ సీక్వెన్స్ సూపర్ అని చెబుతున్నారు. లవ్ ట్రాక్స్ బాగున్నాయట. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలగజేసేలా ఉంటుందని, ఆ సీక్వెన్స్ అదిరిపోతుందని చెబుతున్నారు. అలాగే నాగ్ ఐకానిక్ మూమెంట్ సైకిల్ చైన్ సీన్ రిఫరెన్స్ కూడా ఉంటుందట.

Also read : Saindhav Review : ‘సైంధవ్‌’ మూవీ రివ్యూ.. కూతురు కోసం వెంకీమామ విధ్వంసం..