Nagarjuna Compare Hero Karthi with Pawan Kalyan
Nagarjuna: తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు.
Sardar: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్దార్.. రన్‌టైమ్ ఎంతంటే?
ఈ ప్రోగ్రామ్ కి టాలీవుడ్ కింగ్ నాగార్జున అతిధిగా విచ్చేశాడు. ఈ క్రమంలో నాగ్ మాట్లాడుతూ.. “కార్తీ అన్న సూర్య ఒక సూపర్ స్టార్ మనందరికీ తెలుసు. కానీ ఆ ఇమేజ్ నుండి బయటకు వచ్చి తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు కార్తీ. అలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ నీడ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఇద్దరే.
ఒకరు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, మరొకరు కన్నడ శివరాజన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్. ఆ తరువాత తమిళంలో సూర్య తమ్ముడు కార్తీ. అది అధిగమించడం అంత ఈజీ కాదు, కానీ కార్తీ వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ.. తన అన్న నీడ నుంచి బయటపడి ఇప్పుడు ఇలా స్టార్ గా ఎదిగాడు” అంటూ వ్యాఖ్యానించాడు.