Sardar: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్దార్.. రన్‌టైమ్ ఎంతంటే?

తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కించగా, పూర్తి స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Sardar: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్దార్.. రన్‌టైమ్ ఎంతంటే?

Karthi Sardar Movie Completes Censor Work

Sardar: తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కించగా, పూర్తి స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Karthi Sardar Teaser: సర్దార్ టీజర్.. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కేక పెట్టిస్తున్న కార్తి!

కాగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. సర్దార్ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో కార్తి పలు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాలో కార్తి పర్ఫార్మెన్స్ ఔట్‌స్టాండింగ్‌గా ఉందని చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

Sardar: కార్తి సర్దార్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 45 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. సర్దార్ మూవీతో కార్తి మరోసారి తనదైన సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా, లైలా, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, జివి.ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.