Karthi Sardar Teaser: సర్దార్ టీజర్.. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కేక పెట్టిస్తున్న కార్తి!

తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసంది.

Karthi Sardar Teaser: సర్దార్ టీజర్.. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కేక పెట్టిస్తున్న కార్తి!

Karthi Sardar Teaser Filled With Spy Elements

Karthi Sardar Teaser: తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమాలో కార్తి ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Sardar: కార్తి సర్దార్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసంది. ఈ టీజర్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈ టీజర్‌లో ఓ స్పై కోసం ఇండియన్ ఇంటెలిజెన్స్ వారు వెతుకుతుండటం.. ఆరుగురు వ్యక్తుల్లో ఆ స్పై ఉంటాడని వారు అనుకుంటుండగా.. చివర్లో ఆ ఆరుగురు కూడా ఒకే మనిషి అనే డైలాగ్‌తో ఈ సినిమాలో కార్తి పాత్ర గురించి రివీల్ చేశారు చిత్ర యూనిట్. ఇక పలు రకాల వేషాల్లో మనకు కార్తి ఈ టీజర్‌లో కనిపించాడు. ముఖ్యంగా వృద్ధుడి గెటప్‌లో కార్తి లుక్ కేక పెట్టిస్తోంది.

Sardar: హీరో కార్తీ షాకింగ్ లుక్.. గుర్తు పట్టడం కూడా కష్టమే!

మొత్తానికి టీజర్‌తోనే సర్దార్ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కార్తి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా, జివి.ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో రజిషా విజయన్, రాశి ఖన్నా, చంకీ పాండే, లైలా, సిమ్రాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న సర్దార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.