Sardar: హీరో కార్తీ షాకింగ్ లుక్.. గుర్తు పట్టడం కూడా కష్టమే!

ఒక్కో ఇండస్ట్రీలో హీరోలు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండగా.. దాని కోసం కథల ఎంపికతో పాటు బాడీ పర్ఫెక్ట్ ఫిట్నెస్..

Sardar: హీరో కార్తీ షాకింగ్ లుక్.. గుర్తు పట్టడం కూడా కష్టమే!

Sardar

Sardar: ఒక్కో ఇండస్ట్రీలో హీరోలు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండగా.. దాని కోసం కథల ఎంపికతో పాటు బాడీ పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇక కథ డిమాండ్ చేస్తే డీ గ్లామర్ రఫ్ లుక్ లో కనిపించేందుకు కూడా సిద్దపడుతున్నారు. ఈ మధ్యనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన అల్లు అర్జున్ తన స్టైలిష్ స్టార్ ట్యాగ్ పక్కనపెట్టి పుష్పరాజ్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇలా నేచురాలిటీగా దగ్గరగా పాత్రలను ఎంచుకోవడంలో తమిళ హీరోలు ఎప్పుడూ ముందే ఉంటారన్న సంగతి తెలిసిందే.

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

కోలీవుడ్ లో ఇప్పుడున్న హీరోలందరూ ఏదో ఒక సినిమా కోసం అలా కనిపించిన వారే కాగా.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అయితే.. అసలు కనీసం గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు ఓ పాత్ర కోసం. తమిళంలో సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న కార్తి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. కార్తీ ప్రస్తుతం సర్దార్‌ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాగా.. ఇందులో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలోనూ కార్తీనే నటిస్తున్నాడు.

Kollywood Hero’s: పెరిగిన బెందిరింపులు.. పాపం కోలీవుడ్ హీరోలు!

పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తవగా తాజాగా ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ స్టిల్స్ చూస్తే.. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న కార్తీ కంప్లీట్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒక స్టిల్ లో అయితే పూర్తిగా గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కార్తీని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. తండ్రి పాత్ర కోసం పూర్తి మేకోవర్‌తో డిఫరెంట్‌ లుక్‌లోకి మారిపోయాడు. ఈ సినిమాలో కార్తీ సరసన రాశీఖన్నా నటిస్తుండగా తండ్రి పాత్రకు జోడీగా మరో సీనియర్ నటి నటిస్తుందట.