Kollywood Hero’s: పెరిగిన బెందిరింపులు.. పాపం కోలీవుడ్ హీరోలు!

కోలీవుడ్ స్టార్ హీరోలను బెదిరింపుల గండాలు వెంటాడుతున్నాయి. ఏదోఒక ఇష్యూలో తమిళ హీరోపై బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇవి అక్కడ హీరోలకు కొత్త కాకపోయినా.. రీసెంట్ గా మాత్రం ఇవి ఎక్కువ..

Kollywood Hero’s: పెరిగిన బెందిరింపులు.. పాపం కోలీవుడ్ హీరోలు!

Kollywood Hero's

Kollywood Hero’s: కోలీవుడ్ స్టార్ హీరోలను బెదిరింపుల గండాలు వెంటాడుతున్నాయి. ఏదోఒక ఇష్యూలో తమిళ హీరోపై బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇవి అక్కడ హీరోలకు కొత్త కాకపోయినా.. రీసెంట్ గా మాత్రం ఇవి ఎక్కువ అయ్యాయి.. మొన్న సేతుపతి.. నిన్న విజయ్.. నేడు సూర్య.. అసలేం జరుగుతుంది కోలీవుడ్ లో?

Shyam Singha Roy: పాపం నానీ.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి!

ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఎక్కడా లేని విధంగా కోలీవుడ్ లో హీరోలకు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. రీసెంట్ గా జై భీమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సూర్యకు కొన్ని సంఘాల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. జై భీమ్ లో తమను అవమానించారంటూ వన్నియార్ సంఘం నోటీసులు ఇస్తే.. మరికొంత మంది సూర్యాపై దాడిచేసిన వారికి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. వరుసగా బెదిరింపు కాల్స్ కూడా వస్తుండటంతో సూర్యకు ఆయన కుటుంబానికి పోలిస్ సెక్యూరిటీని పెంచారు. చంద్రు అనే లాయర్ పేదవారికోసం చేసిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని సూర్య బీమ్ మూవీని తెరకెక్కించారు. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా విమర్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే సూర్యకు సిద్థార్ధ్, వెంట్రిమారన్ లాంటి సెలబ్రెటీలు బాహాటంగా సపోర్ట్ చేస్తున్నారు.

Shravya Reddy: హాట్ యాంకర్ శ్రావ్య.. పోజులు చూసినా కిక్కే!

ఒకటి కాదు.. ఇది అది అని కాదు.. రకరకాల కారణాలతో కోలీవుడ్ లో హీరోలకు బెదిరింపులు తప్పడంలేదు. గతంలో రజనీ కాంత్.. కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో అర్ధరాత్రి అలర్డ్ అయిన పోలీస్ లు ఇల్లు సెర్చ్ చేసిన ఏం లేదని తేల్చారు. ఫోల్ చేసింది కూడా మానసిక రోగిగా ఎంక్వైరీలో గుర్తించారు. కొంత మంది ఆకతాయిలు సరదాకోసం ఇలా బెదిరింపులు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

Pushpa: రిలీజ్ ఇక్కట్లు.. పుష్పరాజ్ కు షాకిచ్చిన స్పైడర్ మాన్!

తమిళ హీరోలకు ఈ తిప్పులు ఇప్పటివి కాదు.. హీరోలు అజిత్, ధనుష్, మనిరత్నం, చంద్రకాంత్.. ఇలా చాలా మంది స్టార్ హీరోలకు ఈ తిప్పలు తప్పలదే. ఇక విజయ్ సేతుపతికి అయితే చాలా సార్లు ఇలా కొన్ని సంఘాల నుంచి వ్యతిరేకత, దాడులు ఎదురయ్యాయి. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతు పతిపై దాడి కూడా జరిగింది. కొన్ని మతపరమైన వాఖ్యల వల్లనే ఈ దాడి జరిగినట్టు తెలిసింది. సేతుపతి, శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ బయోపిక్ ఒప్పుకున్నప్పుడు కూడా విజయ్ ను భయంకరంగా ట్రోల్ చేశారు.. ఫోన్ లో బెదిరించారు. దాడులు కూడా జరిగే అవకాశం పెరగడంతో విజయ్ ఆ సినిమాను వదులుకున్నారు. ఇలా కోలీవుడ్ హీరోలపై రీసెంట్ గా బెదిరిపులు పెరిగిపోయాయి.