Shyam Singha Roy: పాపం నానీ.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి!

పాపం నాని... చాలా అనుకున్నాడు.. ఏ సినిమాకు పోటీ రాకుండా.. ఏ సినిమా తనుకు పోటీ లేకుండా ఉండాలని.. ఏరి కోరి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఏ ప్రాబ్లం ఉండదని కూల్ గా తన పని తాను..

Shyam Singha Roy: పాపం నానీ.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి!

Shyam Singha Roy

Shyam Singha Roy: పాపం నాని… చాలా అనుకున్నాడు.. ఏ సినిమాకు పోటీ రాకుండా.. ఏ సినిమా తనుకు పోటీ లేకుండా ఉండాలని.. ఏరి కోరి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఏ ప్రాబ్లం ఉండదని కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్న నాచ్యూరల్ స్టార్ కు.. వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

Shravya Reddy: హాట్ యాంకర్ శ్రావ్య.. పోజులు చూసినా కిక్కే!

ఎటూ తోచని పరిస్థితుల్లో పడిపోయాడు నాచ్యూరల్ స్టార్ నానీ. జర్సీ తరువాత ఒక్క హిట్ కూడా అందుకోని యంగ్ హీరో.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. తప్పక వి, టక్ జగదీష్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. కాని ఆ సినిమాలు సరిగ్గ ఆడలేదు. ఈసారైన తన సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసి.. సక్సెస్ సాధించాలి అని శ్యామ్ సింగరాయ్ ను ముస్తాబు చేస్తున్నాడు నాచురల్ స్టార్. గెటప్ విషయంలో.. కథ విషయంలో.. కొత్తదనం చూపించబోతున్నాడు. టాక్సీవాల ఫేమ్ రాహుల్ ఈమూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

Pushpa: రిలీజ్ ఇక్కట్లు.. పుష్పరాజ్ కు షాకిచ్చిన స్పైడర్ మాన్!

చుట్టూ పెద్ద సినిమాలే ఏవీ పోటీకి లేకపోవడంతో.. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ ఇచ్చేశారు. కాని రిలీజ్ డేట్ ఇచ్చిన తరువాత పరిణామాలు చక చకా మారిపోయాయి. వరుసగా అన్ని సినిమాలు డేట్స్ ఇస్తూ వస్తున్నాయి. దాంతో నానీకి కాంపిటేషన్ మొదలైంది. వరుసగా సినిమాలు నానీకి షాక్ ఇస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 3న రావల్సిన వరుణ్ తేజ్ గని…డిసెంబర్ 2న అఖండ రిలీజ్ అవుతుండటంతో.. 24కు చేరింది. నానీకి పోటీగా నిలిచింది.

Ashu Reddy: స్విమ్మింగ్ పూల్‌లో శారీతో అషు!

దీనికి తోడు మరికొన్ని సినిమాలు 24 డేట్ వైపు చూస్తుండటం..నానీకి నిద్రలేకుండా చేస్తున్నాయి. 24న రిలీజ్ అవ్వడానికి నందమూరి హీరో కల్యాణ్ రామ్ ప్రయోగాత్మక సినిమా బింబిసార కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే డేట్ ను ముందే లాక్ చేసుకుని పెట్టుకున్నాడు సురేందర్ రెడ్డి. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఏజంట్ 24నే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా నానీ చుట్టూ సినిమాలు ఉచ్చు బిగుసుకోవడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు.