Pushpa: రిలీజ్ ఇక్కట్లు.. పుష్పరాజ్ కు షాకిచ్చిన స్పైడర్ మాన్!

టాలీవుడ్ లో చాలా సినిమాలు క్లాష్ ల నుంచి తప్పించుకుని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. అయినా ట్రిపుల్ ఆర్-రాధ్యేశామ్ లాంటి సినిమాలకు పోటీ తప్పడం లేదు.

Pushpa: రిలీజ్ ఇక్కట్లు.. పుష్పరాజ్ కు షాకిచ్చిన స్పైడర్ మాన్!

Pushpa

Pushpa: టాలీవుడ్ లో చాలా సినిమాలు క్లాష్ ల నుంచి తప్పించుకుని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. అయినా ట్రిపుల్ ఆర్-రాధ్యేశామ్ లాంటి సినిమాలకు పోటీ తప్పడం లేదు. ఇక సేఫ్ జోన్ లో ఉన్నాంలే అనుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాకు హాలీవుడ్ మూవీ షాక్ ఇచ్చింది.

Ashu Reddy: స్విమ్మింగ్ పూల్‌లో శారీతో అషు!

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు సినిమాకు తెలుగు సినిమాలతోనే పోటీ తట్టుకోలేక పోతున్నారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ ఇస్తారా.. అది ఎక్కడ వచ్చి ఇబ్బంది పెడుతుందా అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతీ సినిమా వాళ్లు భయపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమాకు ఓ కొత్త చిక్కు వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు హాలీవుడ్ గండం పొంచి ఉంది. పుష్ప రిలీజ్ అవుతున్న అదే డిసెంబర్ 17కి.. హాలీవుడ్ మూవీ స్పైడర్ మేన్ కూడా రిలీజ్ కాబోతోంది.

Arjuna Phalguna: అమ్మోరులో దమ్మే ఈ అర్జునుడు.. మరో లిరికల్ సాంగ్ రిలీజ్!

అల్లు అర్జున్ పుష్ప మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్తుండటంతో… ఈ సినిమా గురించి సుకుమార్ బాగా కష్టపడుతున్నారు. సినిమా షూటింగ్ అయిపోయింది అనకున్న టైమ్ లో కాంపిటేషన్ కు తగ్గట్టుగా.. ఆడెడ్ అట్రాక్షన్ గా సమంతను రంగంలోకి దింపుతున్నారు. పక్కా మాస్ క్యారెక్టర్ లో బన్నీ మనసు పెట్టి చేసిన ఈమూవీ.. ఎటువంటి పోటీ లేకుండా డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసుకుంటే.. బన్నీకి స్పైడర్ మాన్ భారీ షాక్ ఇవ్వబోతోంది.

Telugu New Films: ముందుంది సినిమా పండగ.. థియేటర్లు రచ్చ రచ్చే!

పుష్ప సినిమా ప్రమోషన్స్ కోసం భారీ ప్లానింగ్ చేసుకున్నారు టీమ్. పుష్ప మీద ఎంత హైప్ ఉన్నా.. అటు స్పైడర్ మాన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా వెయిట్ చేస్తుంటారు ఆడియన్స్. బన్నీ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్తున్నాడు. ఆంధ్ర, కేరళలో పుష్పకు ఎటువంటి నష్టం ఉండకపోవచ్చు. కాని హిందీ, తమిళ మార్కెట్లలో స్పైడర్ మాన్ గట్టిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసలే హాలీవుడ్ మూవీ.. అందులోను స్పైడర్ మాన్ అంటే భారీ కలెక్షన్స్ టార్గెట్ గా కదులుతారు. ముఖ్యంగా ఏ క్లాస్ ఆడియన్స్ స్పైడర్ మ్యాన్ వైపు వెళ్లినా.. మాస్ జనం పుష్పకు అండగా ఉండే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా పుష్పకు స్పైడర్ మేన్ గట్టి పోటీ ఇస్తుందనడంలో ఏటువంటి డౌట్ లేదు. మరి బన్నీ ఏం చేస్తాడో చూడాలి.