Kuberaa : ఒకే సినిమా.. తమిళ్ – తెలుగు రెండు భాషల్లో రెండు వెరియేషన్లు.. సినిమా నిడివి కూడా వేర్వేరు..

ఇప్పుడు కుబేర సినిమాకు అదే జరిగింది.

Nagarjuna Dhanush Rashmika Mandanna Kuberaa Movie have Two Different output in Tamil and Telugu

Kuberaa : సాధారణంగా సినిమాలు ఇక్కడ ఒక వర్షన్ తో రిలీజయితే ఓవర్సీస్ లో ఇంకో వర్షన్ లో రిలీజవుతాయి. ఇక్కడ సెన్సార్ లో కట్ అయినవన్నీ ఓవర్సీస్ కాపీలో ఉంటాయి. కొన్ని సినిమాలకు రిలీజయ్యే ప్రాంతాన్ని బట్టి, అక్కడి పరిస్థితులను బట్టి ఎడిటింగ్ లో మార్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుబేర సినిమాకు అదే జరిగింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున – ధనుష్ మెయిన్ లీడ్స్ లో ఉన్న కుబేర సినిమాకు కూడా తెలుగు – తమిళ్ లో షూట్ చేసారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక వర్షన్ రిలీజవుతుంటే తమిళ్ లో మరో వర్షన్ రిలీజవుతుంది. రెండిట్లో కొన్ని మార్పులు ఉన్నాయట.

Also Read : Satya Sri : బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సత్యశ్రీ.. ఆల్రెడీ అడిగారు..

కథలో మార్పులు లేకపోయినా తమిళ్ లో ధనుష్ ఫ్యాన్స్, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తమిళ్ లో రిలీజయ్యే కుబేర సినిమాలో తెలుగుతో పోలిస్తే ధనుష్ సీన్స్ లో డిఫరెన్స్ ఉందట. అలాగే తమిళ్ లో తెలుగు కంటే నిడివి ఎక్కువే ఉందని టాక్ వినిపిస్తుంది. సెన్సార్ విషయంలో కూడా తమిళ్, తెలుగుకి డిఫరెన్స్ ఉందని సమాచారం. తెలుగు వర్షన్ లో సెన్సార్ బోర్టు 19 సన్నివేశాల్లో 13 నిమిషాలు కట్స్ చెప్పారట. తమిళ్ లో మాత్రం 7 నిమిషాల కట్స్ చెప్పారట.