Vijay Binni : చిరంజీవి కోసం రాబోతున్న నాగార్జున డైరెక్టర్.. ‘విశ్వంభర’ సినిమాలో..

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

Vijay Binni : చిరంజీవి కోసం రాబోతున్న నాగార్జున డైరెక్టర్.. ‘విశ్వంభర’ సినిమాలో..

Nagarjuna Director Vijay Binni Working For Megastar Chiranjeevi Vishwambhara Movie

Updated On : March 14, 2024 / 10:43 AM IST

Vijay Binni : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర'(Vishwambhara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో విశ్వంభర సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఇందులో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం విశ్వంభర సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ పాటని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇటీవలే విజయ్ బిన్నీ నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో దర్శకుడిగా కూడా మారాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దర్శకుడిగా మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు ఈ డ్యాన్స్ మాస్టర్.

Also Read : Gopichand : శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి ఎవరు సెట్ చేశారో తెలుసా?

నాగార్జునతో వర్క్ చేసిన కొన్ని రోజులకే ఇప్పుడు చిరంజీవితో పనిచేయడం విశేషం. విశ్వంభర సినిమాలో చిరంజీవి, త్రిషల మధ్య సాగే ఓ పాటని విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలిపాడు. తన డ్యాన్స్ తో మెగాస్టార్ ని మెప్పించి డైరెక్టర్ గా కూడా ఛాన్స్ కొట్టేస్తాడేమో చూడాలి. ఇక విశ్వంభర సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.

Nagarjuna Director Vijay Binni Working For Megastar Chiranjeevi Vishwambhara Movie