Nagarjuna gives Clarity about 2025 Sankranti Fight in Naa Saami Ranga Success Event
Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ'(Naa Saami Ranga) సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. ఈ సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ కూడా తెచ్చుకుంది. సంక్రాంతికి నాగార్జున సినిమా వస్తుందంటే పండగలాంటి సినిమా తెస్తాడని అందరూ ఫిక్స్ అయిపోతారు. దీంతో సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలున్నా నాగార్జున పట్టించుకోకుండా, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా తన సినిమాని తీసుకొచ్చి హిట్ కొడతాడు. ఈ సారి కూడా అలాగే సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు.
తాజాగా నా సామిరంగ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నాగార్జున స్పీచ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని అన్నారు. నాగార్జున ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఈ సినిమా నాన్న గారి జయంతి సెప్టెంబర్ 20న మొదలుపెట్టాం. ఆ రోజు నాన్న గారి విగ్రహం ఈవెంట్ కూడా జరిగింది. అది అవ్వగానే ఫాస్ట్ గా వెళ్లిపోతుంటే ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికి అని అడిగితే సినిమా షూట్ అన్నాను. ఈవెంట్ అవుతుంటే ఎందుకు అయ్యాక వెళ్లొచ్చు కదా అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలి అంటే అందరూ బిత్తరపోయారు. పిచ్చెక్కిందా అన్నారు. మూడు నెలలు టైం పెట్టుకొని షూట్ కూడా అవ్వకుండా సంక్రాంతికి ఎలా రిలీజ్ చేస్తావ్ అన్నారు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవ్వరికి నమ్మకం లేదు. కానీ మూవీ యూనిట్ అంతా నమ్మి ఫాస్ట్ గా షూట్ చేశాం. జనవరి 4కి సినిమా పూర్తయింది. కీరవాణి గారు మమ్మల్ని ఇంకా తొందరపెట్టి, మ్యూజిక్ అంతా టైంకి ఇచ్చి సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా చేశారు అని చెప్పి చిత్రయూనిట్, ఫ్యాన్స్.. అందరికి థ్యాంక్స్ చెప్పారు. చివర్లో మళ్ళీ వచ్చే సంక్రాంతికి కలుద్దాం అన్నారు.
దీంతో వచ్చే సంక్రాంతికి నాగార్జున మళ్ళీ రాబోతున్నాడు అని క్లారిటీ వచ్చేసింది. ఈ సంక్రాంతికి జరిగిన సినిమాల పోటీ, థియేటర్స్ ఇష్యూ చూసి చాలామంది ఇప్పుడే వచ్చే సంక్రాంతికి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Vishwambhara) సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇక ఎప్పట్లాగే దిల్ రాజు(Dil Raju) సంక్రాంతికి తన సినిమా ఉండాలని శతమానం భవతి సీక్వెల్ అనౌన్స్ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. మరో పక్క హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతి సంక్రాంతికి ఒక సినిమా ఉంటుందని చెప్పాడు. ఈసారి బాలకృష్ణ(Balakrishna) సినిమా కుడా ఉండబోతున్నట్టు టాక్.
వీటన్నిటితో పాటు ఇప్పుడు నాగార్జున సంక్రాంతికి కలుద్దాం అని క్లారిటీ ఇవ్వడంతో నాగ్ సినిమా కూడా ఉంటుందని తెలిసిపోతుంది. ధనుష్, నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సంక్రాతికి రిలీజ్ అవ్వొచ్చు లేదా బంగార్రాజు సీక్వెల్ రావొచ్చు అని సమాచారం. మొత్తానికి 2025 సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ పడుతున్నారు. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి.