తాత కాబోతున్న కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడు.. అయితే నాగార్జున తాత అయ్యేది నిజమే కానీ రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లోనే. దర్శకుడు కురసాల కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చటంతో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించడానికి ఒకే చెప్పేశారట. మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికి బంగార్రాజు టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడన్న టాక్ ఇండస్ట్రీ వినిపిస్తోంది.
నాగచైతన్యకు తాతగా నాగ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశముంది. దేవదాసు తర్వాత గ్యాప్ తీసుకున్న నాగ్, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రతో పాటు మరో మలయాళం సినిమాలో నటిస్తున్నారు.