Nagarjuna : మా నాన్న బయోపిక్ తీస్తే బోరింగ్ ఉంటుంది.. కానీ.. నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏఎన్నార్ గారి బయోపిక్ తెరకెక్కిస్తారా అని అడగ్గా నాగార్జున ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Nagarjuna Interesting Comments on ANR Biopic

Nagarjuna : గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో ఏఎన్నార్ 100 వ జయంతి సందర్భంగా స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు క్లాసిక్ సినిమాలను ప్లే చేసి అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. అక్కినేని కుటుంబం అంతా ఈ ఈవెంట్ కు తరలి వచ్చింది.

ఈ ఈవెంట్లో నాగార్జున అక్కడి ప్రేక్షకులతో మాట్లాడగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఏఎన్నార్ గారి బయోపిక్ తెరకెక్కిస్తారా అని అడగ్గా నాగార్జున ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Also Read : Mechanic Rocky : ‘మెకానిక్ రాకీ’ సినిమా చూడండి.. విశ్వక్ సేన్ కార్ గెలుచుకోండి..

నాగార్జున మాట్లాడుతూ.. బయోపిక్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉండాలి. సినిమా కథ రాసే విధంగా ఉండాలి. కానీ మా నాన్న లైఫ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా డౌన్ అవ్వలేదు. అలాంటప్పుడు ఆయన కథని సినిమా తీస్తే బోర్ కొడుతుంది. అందుకే నాన్న గారి బయోపిక్ తీయను. కానీ డాక్యుమెంటరీ చేసే ఆలోచన ఉంది అని తెలిపారు. దీంతో నాగ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాగ్ వ్యాఖ్యలతో అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ ఉండదని క్లారిటీ వచ్చేసింది.