Naa Saami Ranga : ‘నా సామి రంగ’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అంటున్న నాగార్జున..
తాజాగా నా సామి రంగ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే.. అని సాగే పాటని రిలీజ్ చేశారు.

Nagarjuna Naa Saami Ranga Movie first Song Released
Naa Saami Ranga : టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) కొంచెం గ్యాప్ తీసుకోని అనౌన్స్ చేసిన మూవీ ‘నా సామిరంగ’. అసలు ఎక్కడా కనపడకుండా సడెన్ గా వచ్చి సంక్రాంతి రేసులో నిలిచారు నాగ్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది నా సామికి రంగ. ఈ సినిమాలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్ గా నటిస్తుండగా ఇంకో హీరోయిన్ కూడా ఉందని సమాచారం.
డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తుంటే ఇది కూడా గత నాగార్జున సినిమాల్లాగే పండక్కి ఎంటర్టైన్మెంట్ లా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే.. అని సాగే పాటని రిలీజ్ చేశారు.
Also Read : Vasanthi Krishnan Engagement : బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ నిశ్చితార్థం ఫొటోలు..
ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా ఎం ఎం కీరవాణి సంగీతంలో రామ్ మిరియాల పాడారు. తాజాగా లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున, ఆషిక రంగనాథ్ కలిసి వేసిన స్టెప్స్ ని కూడా చూపించారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఇక సంక్రాంతి పండక్కి నాగార్జున ఎప్పటిలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని అంతా భావిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అని చెప్పినా ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.