Naa Saami Ranga : నాగార్జున సినిమా కోసం ఆ ఇద్దరు ముద్దగుమ్మలు.. నా సామిరంగ..!

నాగార్జున చేస్తున్న 'నా సామిరంగ' సినిమా కోసం ఆ ఇద్దరు ముద్దగుమ్మలను ఫైనల్ చేశారట.

Nagarjuna Naa Saami Ranga movie heroine updates in telugu

Naa Saami Ranga : టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) చాలా గ్యాప్ తీసుకోని అనౌన్స్ చేసిన మూవీ ‘నా సామిరంగ’. ఈ మూవీలో నాగ్ మాస్ రోల్ లో అలరించబోతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీలో నటించే నటీనటులు గురించి మూవీ టీం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఈ సినిమాలో నటించబోయే యాక్టర్స్ వీరేనంటూ ఫిలిం వర్గాల్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Salaar : సలార్ ఆ మూవీకి రీమేక్.. కన్ఫార్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్..

ఈ సినిమాలో నాగార్జునతో పాటు మరో హీరో అల్లరి నరేష్ (Allari Naresh) కూడా నటించబోతున్నాడట. ఇక వీరిద్దరికి హీరోయిన్లుగా ఇద్దరు ముద్దగుమ్మలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందట. ‘అమిగోస్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), ఇటీవల జైలర్, ఉగ్రం సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘మిర్నా మీనన్’ (Mirnaa Menon) ఈ మూవీలో హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. నాగార్జున సరసన ఆషికా, నరేష్ కి జోడిగా మిర్నా నటించబోతున్నారని తెలుస్తుంది.

Skanda Collections : బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ ‘స్కంద’ కలెక్షన్స్ దూకుడు..

కాగా ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పోరింజు మరియం జోస్’కి రీమేక్ గా తెరకెక్కుతోందని అని సమాచారం. అయితే దీని గురించి మూవీ టీం నుంచి ఎటువంటి సమాచారం లేదు. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా కథ జరుగుతుంది. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. చిట్టూరి శ్రీనివాస ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి రిలీజ్ కాబోతుంది.