Nagarjuna: వదిలేస్తే డిజాస్టర్.. ఇకపై వదిలేది లేదంటోన్న నాగ్..?

అక్కినేని నాగార్జున తన వారసుడు అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమాల స్క్రిప్టును ఇకపై తానే స్వయంగా విని ఫైనల్ చేయనున్నాడట.

Nagarjuna To Indulge In Akhil Akkineni Movies Selection

Nagarjuna: అక్కినేని నాగార్జున తన వారసులుగా నాగచైతన్య, అఖిల్‌లను ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేశాడు. చైతూ ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకెళ్తూ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అఖిల్ మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. దీంతో నాగార్జున అఖిల్ విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.

Nagarjuna : అఖిల్ కడుపులో ఉన్నప్పుడు అమలను ఇబ్బంది పెట్టాడు.. బయటకు వచ్చాక మమ్మల్ని.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే..

గతంలో అఖిల్ చేస్తున్న సినిమాలను ఫైనల్ చేసే బాధ్యతను నాగ్ తీసుకున్నాడు. కానీ, కొంతకాలంగా అఖిల్ తన సినిమాలను తానే సెలెక్ట్ చేస్తూ, సినిమాలను చేస్తూ వెళ్తున్నాడు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్క్రిప్టులను ఓకే చేస్తున్నాడు. అయితే సురేందర్ రెడ్డి వంటి డైరెక్టర్‌తో ‘ఏజెంట్’ మూవీని చేస్తున్నాడని తెలుసుకుని నాగ్ సంతోషించాడు. కానీ, నాగ్ సంతోషం ఎక్కువరోజులు ఉండలేదు. ఏజెంట్ మూవీ డిజాస్టర్‌గా మిగలడంతో ఇప్పుడు నాగ్ మరోసారి అఖిల్ సినిమా ఎంపికపై కసరత్తు చేయనున్నాడని తెలుస్తోంది.

Nagarjuna : టాలెంట్ ఉందా.. అయితే నాగార్జునకి వాట్సాప్ చేయండి..

ఇకపై అఖిల్ ఎలాంటి స్క్రిప్టు సెలెక్ట్ చేయాలనేది నాగ్ స్వయంగా చూసుకుంటాడట. దీంతో అఖిల్‌కు ఎలాగైనా హిట్ అందించేందుకు నాగ్ స్వయంగా రంగంలోకి దిగాడని.. ఇకపై అఖిల్‌తో ఎవరు సినిమా చేయాలన్నా, ఖచ్చితంగా నాగ్‌ను మెప్పించాల్సిందే అనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం పక్కనబెడితే, ఇప్పుడు అఖిల్‌కు ఖచ్చితంగా హిట్ పడాల్సిందే అనే మాట వాస్తవం.