‘వైల్డ్ డాగ్’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే!

Nagarjuna’s Wild Dog – OTT: ‘కింగ్’ నాగార్జున నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. నాగ్ టైటిల్ రోల్‌లో, ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ చిత్రానికి ఓ ఆఫర్ వచ్చిందనీ, దానికి మూవీ టీమ్ ఓకే అనడంతో డీల్ కుదిరిందనీ, ‘వైల్డ్ డాగ్’ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుందనీ, ఓటీటీలో విడుదలైన తెలుగు చిత్రాల్లో స్టార్ హీరో చిత్రమిదే అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే థియేటర్లకు పర్మిషన్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో హాళ్లు తెరుచుకోబోతున్నాయి. మరి అలాంటప్పుడు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారే మాటలు అవాస్తవం. శాటిలైట్ తరహాలోనే డిజిటల్ రైట్స్ కూడా అమ్ముతారు కాబట్టి ఆ ప్రాసెస్‌లో చర్చలు జరుగుతుండొచ్చు..
https://10tv.in/chiranjeevi-and-aamir-khan-voiceover-for-rrr/
పెద్ద హీరో సినిమా కాబట్టి కచ్చితంగా థియేటర్లలోనే విడుదలవుతుంది.. నాలుగు లేదా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశముంది అంటున్నారు సినీ వర్గాలవారు. ఈ మూవీలో నాగార్జునకు జోడీగా దియా మీర్జా నటిస్తుండగా, సయామీ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, అన్వే్‌షరెడ్డి నిర్మిస్తున్నారు.