నమ్రతా ఒంటిపై మహేశ్ టాట్టూ.. మీకు తెలుసా

నమ్రతా తన బాయ్ ఫ్రెండ్, భర్త, సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరును టాట్టూ వేయించుకున్నారు. భర్త, పిల్లలపై ఉన్న అమితమైన ప్రేమను పచ్చబొట్టుతో వ్యక్తపరచుకున్నారు. కుటుంబంపై ఉన్న ప్రేమను తన చేతిపై ఉన్న పచ్చబొట్టులో మహేశ్ బాబు పేరు, కూతురు సితార పేరు, కొడుకు గౌతమ్ పేరు రాయించుకుంది.
ఇటీవల ఇన్‍స్టాగ్రామ్ లైవ్‌లో నమత్రా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సహనంతో సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా అభిమానులతో వాళ్ల జీవితాల్లో అరుదైన క్షణాలను పంచుకుంది. ఫ్యాన్లు టాట్టూ గురించి రిక్వెస్ట్ చేసేసరికి.. వాటికి నమ్రతా ఆన్సర్ చేసింది. సహజంగా సిగ్గరి అయిన నమత కుటుంబ జీవితం గురించి ఎక్కువగా చెప్పుకోని ఆమె రూల్స్ బ్రేక్ చేసి టాట్టూ గురించి చెప్పేసింది.
తన సహ నటుడు అయిన మహేశ్, మాజీ మిస్ ఇండియా నమత్రా వివాహం చేసుకున్నప్పటి నుంచి యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది. ఫ్యామిలీ లైఫ్ కే జీవితాన్ని త్యాగం చేసింది. పిల్లలు పెరిగిన తర్వాత నమ్రతా మళ్లీ యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు.