Guntur Kaaram : మహిళలకు ‘గుంటూరు కారం’ స్పెషల్ షో.. ఎక్కడ..? ఎప్పుడో తెలుసా..?

మహిళలకు 'గుంటూరు కారం' స్పెషల్ షో.. ఎక్కడ..? ఎప్పుడో తెలుసా..?

Namrata Shirodkar arrages Guntur Kaaram special show for Mahesh Babu lady fans

Guntur Kaaram : అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే మహేష్ ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్‌తో ఈ మూవీలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. గత కొంతకాలంగా మహేష్ నుంచి క్లాస్ సినిమాలే వస్తున్నాయి.

మహేష్ ని ఒక మాస్ కమర్షియల్ రోల్ లో చూసి అభిమానులకు చాలా ఏళ్ళు అవుతుంది. ఇక ఇప్పుడు గుంటూరు కారం ఒక పక్కా కమర్షియల్ ఫార్మేట్ లో వస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో జనవరి 12న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం ఫుల్ అయ్యిపోవడం కూడా జరుగుతుంది. కాగా మహేష్ కి లేడీస్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే.

Also Read : Mahesh Babu : థ్యాంక్యూ గుంటూరు.. మహేష్, నమ్రత ఎమోషనల్ పోస్టులు..

వాళ్ళు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు. కానీ అది కుదరక చాలామంది బాధ పడుతుంటారు. ఇక ఆ లేడీ ఫ్యాన్స్ బాధని గమనించిన నమ్రత.. వారికోసం ఓ స్పెషల్ షో వేయిస్తున్నారు. కేవలం లేడీస్ కి మాత్రం ఆ షో పడబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ నమ్రత.. తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ వేశారు. ఇంతకీ ఆ స్పెషల్ ఎక్కడ..? ఎప్పుడు పడుతుందో తెలుసా..?

విజయవాడ గాంధీ నగర్‌లోని రాజ్ థియేటర్ లో ఈ స్పెషల్ షోని నమ్రత ఏర్పాటు చేశారు. రాజ్ థియేటర్ లో గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో కేవలం మహిళలకు మాత్రం పడబోతోంది. మరి మహేష్ బాబు సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని కలలు కంటున్న లేడీ ఫ్యాన్స్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక ఈ పోస్ట్ చూసిన కొందమంది లేడీ ఫ్యాన్స్.. ఇలా ప్రతి సెంటర్ లో ఏర్పాటు చేయించండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.