×
Ad

Akhanda 2 : అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎప్పుడు, ఎక్క‌డ, ఎన్ని గంట‌ల‌కు అంటే..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న చిత్రం అఖండ‌-2 (Akhanda 2).

Nandamuri Balakrishna Akhanda 2 pre release event on november 28th

Akhanda 2 : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న చిత్రం అఖండ‌-2. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తుండ‌డంతో ఈ మూవీ (Akhanda 2)పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వ‌హించేందుకు చిత్ర బృందం స‌న్నాహ‌కాలు చేస్తోంది.

NBK 111 : యోధుడిగా బాలయ్య.. పోస్ట‌ర్ అదుర్స్‌.. ద్విపాత్రాభినయం!

శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 28) కూక‌ట్‌ప‌ల్లిలోని కైత్లాపూర్ మైదానంలో నిర్వ‌హించ‌నుంది. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ఈవెంట్ సాయంత్రం 5 గంట‌ల నుంచి ప్రారంభం కానున్న‌ట్లు తెలిపింది.

Varanasi : వారణాసిలో మహేశ్ బాబు మేనల్లుడు!

ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై అంచ‌నాల‌ను ఇంకా పెంచాయి.