Site icon 10TV Telugu

Rajinikanth : నంద‌మూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం.. ర‌జినీకాంత్ స్పెష‌ల్ ట్వీట్‌

Balakrishna Golden Jubilee Celebrations Superstar Rajinikanth special tweet

Balakrishna Golden Jubilee Celebrations Superstar Rajinikanth special tweet

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సంద‌ర్భంగా బాల‌య్య‌కు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ అభినంద‌న‌లు తెలిపారు.

‘యాక్షన్ కింగ్‌.. క‌లెక్షన్ కింగ్.. డైలాగ్ డెలివరీ కింగ్.. నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అద్భుత‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఒక గొప్ప విజయం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. ఆయురాగ్యాల‌తో ప్ర‌శాంతంగా, ఆనందంగా ఆయ‌న జీవించాల‌ని కోరుకుంటున్నాను.’ అని ర‌జినీ కాంత్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు బాల‌య్య‌కు విషెస్ చెబుతున్నారు.

35 Chinna Katha Kaadu Trailer : ’35 – చిన్న క‌థ కాదు’ ట్రైల‌ర్.. కొడుకు కోసం నివేదా

బాల‌కృష్ణ న‌టించిన మొద‌టి మూవీ ‘తాత‌మ్మ క‌ల’ విడులై ఈ ఏడాదితో యాభైఏళ్లు పూర్తి అయ్యాయి. నటనలో తన తండ్రి నందమూరి తారకరామారావు పేరు నిలబెట్టేలా పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక, మాస్, కమర్షియల్.. అన్ని రకాల సినిమాలు చేసి ఫ్యాన్స్ ని, తెలుగు ప్రేక్షకులని అల‌రించారు బాల‌య్య‌. న‌టుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా స్వ‌ర్ణోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని టాలీవుడ్ నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా నేడు (సెప్టెంబ‌ర్ 1 ఆదివారం) ఈ వేడుక చేయ‌నుంది.

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అక్కినేని అఖిల్, గోపిచంద్‌, సాయి ధ‌ర‌మ్, విజ‌య్ సేతుప‌తి, శివ‌కార్తికేయ‌న్ ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు ఇప్ప‌టికే ఆహ్వానం అందింది.

నందమూరి ఫ్యామిలీ వార్‌.. ‘దేవర’ సినిమాపై ఎఫెక్ట్‌ చూపబోతుందా?

ఇక సినిమాల‌ విష‌యానికి వ‌స్తే.. బాల‌య్య ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. NBK 109 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య లు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

Exit mobile version