Balakrishna – Prithviraj Sukumaran : హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో బాలయ్య మూవీ.. వీడియో వైరల్..

హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో బాలయ్య మూవీ చేయబోతున్నారా..? పృథీరాజ్ ఏమన్నారు..?

Nandamuri Balakrishna movie in Prithviraj Sukumaran direction

Balakrishna – Prithviraj Sukumaran : కోలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ సినిమా ఈ వారం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్, నందమూరి బాలకృష గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టర్ మాత్రమే కాదు డైరెక్టర్ అన్న విషయం కూడా తెలిసిందే. ‘ఒకవేళ తెలుగులో డైరెక్షన్ ఛాన్స్ వస్తే ఏ హీరోతో చేస్తారు..?’ అని ప్రశ్నించారు. దీనికి పృథ్వీరాజ్ బదులిస్తూ.. “చాలామంది ఉన్నారు. మొదటిగా అయితే ప్రభాస్ తో చేస్తాను. అలాగే బాలయ్య సార్ తో కూడా చేయాలి. ఆయనని ఇప్పటివరకు చూసిన మాస్ యాక్షన్ రోల్స్ లో కాకుండా, ఒక డిఫరెంట్ ఫన్ రోల్ లో చూపించాలని ఉంది. మలయాళ కమర్షియల్ సినిమా తరహాలో బ్రో డాడీ వంటి మూవీని బాలయ్య సార్ తో చేయాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Ram Charan : చరణ్ బావగారికి.. లావణ్య త్రిపాఠి విషెస్.. పోస్టు వైరల్..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి పృథ్వీరాజ్ భవిషత్తులో బాలయ్యతో ఏమైనా సినిమా చేస్తారా లేదా చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ NBK109 సినిమాలో నటిస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే మరో మలయాళ యాక్టర్ టామ్ చాకో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

కాగా బాలకృష్ణ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.