Ram Charan : చరణ్ బావగారికి.. లావణ్య త్రిపాఠి విషెస్.. పోస్టు వైరల్..
చరణ్ బావగారికి వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి బర్త్ డే విషెస్. పోస్టు వైరల్..

Varun Tej wife Lavanya tripathi birthday wishes to Ram Charan
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతిఒక్కరు చరణ్ కి బర్త్ డే విషెస్ ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మెగా ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి కూడా బర్త్ డే విషెష్ వస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పటివరకు తన కొడుకుకి విషెస్ తెలియజేయలేదు. ఇక మిగిలిన కుటుంబసభ్యుల విషయానికి వస్తే.. మొదటిగా బాబాయ్ పవన్ నుంచి విషెస్ వచ్చాయి.
తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పవన్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ స్పెషల్ వీడియో పోస్టు చేస్తూ విషెస్ తెలియజేసారు. ఇక చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, సుష్మిత బర్త్ డే విషెస్ ని తెలిపారు. ఈక్రమంలోనే మెగావారి కొత్త కోడలు లావణ్య త్రిపాఠి కూడా చరణ్ బావగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
Also read : Game Changer : ఆ దేశ రాజధానిని.. ‘జరగండి’ సాంగ్ లొకేషన్‌గా మార్చేసిన శంకర్..
తన ఇన్‌స్టాలో చరణ్ తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. “మరో గొప్ప సంవత్సరం, సక్సెస్ రావాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు రామ్ చరణ్” అంటూ లావణ్య రాసుకొచ్చారు. ఇక ఈ పిక్ ని మెగా అభిమానులు వైరల్ చేస్తూ వస్తున్నారు. మరి లావణ్య షేర్ చేసిన ఆ పోస్టు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
View this post on Instagram
కాగా రామ్ చరణ్ ఈరోజు ఉదయం ఉపాసన, క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. కూతురు పుట్టిన తరువాత చరణ్ జరుపుకుంటున్న మొదటి బర్త్ డే కావడంతో సెలబ్రేషన్స్ ని స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.