NBK109 : బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అదేనట.. ‘వీరమాస్‌’గా ఉందిగా..

ప్రస్తుతం NBK109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అదేనట. 'వీరమాస్‌'గా ఉందిగా..

NBK109 : బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అదేనట.. ‘వీరమాస్‌’గా ఉందిగా..

Nandamuri Balakrishna NBK109 movie title update

NBK109 : దర్శకుడు బాబీతో నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్యని చూపించినంత వైలెంట్ గా ఈ సినిమాలో చూపిస్తానంటూ బాబీ చెప్పుకొచ్చారు. ఆ మాటలకు తగట్టలే ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ లో యాక్షన్ తో అదుర్స్ అనిపించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ మూవీ టైటిల్ ని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం NBK109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకి ఒక మాస్ టైటిల్ ని అనుకున్నారట. దర్శకుడు బాబీ ఈ చిత్రానికి ‘వీరమాస్‌’ అనే టైటిల్ ని ఖరారు చేశారట. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం వర్గాల్లో వైరల్ గా మారింది.

Also read : Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి సినిమా కథ ఏంటో తెలుసా..? ఆల్రెడీ మూడు సాంగ్స్..!

మరి దర్శకుడు బాబీ నిజంగానే ఈ టైటిల్ ని ఖరారు చేసారో లేదో తెలియదు గాని, ఫ్యాన్స్ కి అయితే ఈ టైటిల్ బాగా నచ్చేసింది. దీంతో ఈ టైటిల్ న్యూస్ నిజం అయితే బాగుండని ఫీల్ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారట. ఆల్రెడీ దుల్కర్ తో కొన్ని సీన్స్ ని కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే మరో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా అదిరిపోయే స్టార్ కాస్ట్ తో మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. మరి బాబీ, బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.