Nandamuri Balakrishna Viral Political Comments in Legend Movie 10 Years Event goes Viral
Balakrishna : బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన లెజెండ్(Legend) సినిమా పదేళ్ల తర్వాత మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమా 2014లో రిలీజయి అప్పట్లో భారీ విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఓ థియేటర్ లో 1000 రోజులు కూడా ఆడింది ఈ సినిమా 100 రోజులు 31 సెంటర్స్ లో ఆడింది. 70 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసి అప్పట్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
లెజెండ్ రిలీజయి 10 ఏళ్ళు అయిన సందర్భంగా ఇప్పుడు మార్చి 30న ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా లెజెండ్ పదేళ్ల వేడుక, రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఈ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ సినిమా గురించి, సినిమా రికార్డుల గురించి, అప్పటి సినిమా విశేషాల గురించి మాట్లాడారు. అయితే త్వరలో ఎన్నికలు ఉండటంతో ఇండైరెక్ట్ గా కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేసారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. పసుపు శుభానికి సూచికం, ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం, పసుపు సంక్షేమానికి నిర్వచనం, పసుపు అనేది అభివృద్ధికి సూచకం, పసుపు అనేది ఆత్మభిమానంకు నిలువెత్తు రూపం, ఆత్మ గౌరవంకు ఎగరేసిన కేతనం. అలాగే లెజెండ్ సినిమా 2014 ఎన్నికల ముందు రిలీజయింది. అప్పుడు ఎన్నికల్లో ఈ సినిమా ప్రభావం కనపడింది. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సినిమా ప్రభావం మళ్ళీ రేపు ఎలక్షన్స్ లో చూస్తారు. ఇప్పుడు మరీ ఎక్కువగా రాజకీయాలు మాట్లాడితే బాగోదు, ఇక రాజకీయం గురించి రేపట్నుంచి ప్రచారంలో మాట్లాడుతాను అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో బాలయ్య బాబు స్పీచ్ వైరల్ గా మారింది.