వెంక‌య్య నాయుడుకి శుభాకాంక్ష‌లు తెలిపిన‌ నందమూరి బాలకృష్ణ

  • Published By: sekhar ,Published On : July 1, 2020 / 04:01 PM IST
వెంక‌య్య నాయుడుకి శుభాకాంక్ష‌లు తెలిపిన‌ నందమూరి బాలకృష్ణ

Updated On : July 1, 2020 / 5:11 PM IST

ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం MLA, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాలకృష్ణ, భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎమ్‌. వెంక‌య్య నాయుడు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. జులై 1 వెంక‌య్య నాయుడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా…

“అకుంఠిత కృషి, పట్టుదలతో అంచలంచెలుగా తెలుగు వారు గర్వించే నేతగా ఎదిగి నేడు భారత దేశ ఉపరాష్ట్రపతి గా సేవలందిస్తున్న శ్రీ ఎమ్. వెంకయ్యనాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను’’ అని నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

NBK WISHES TO Venkaiah Naidu

Read:వెన్నెలగా శివానీ రాజశేఖర్..