NBK’s Narthanasala: పొట్టి సినిమాకు బుజ్జి ట్రైలర్!

Narthanasala Trailer: సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన Mythological Epic ‘‘నర్తనశాల’’.. ఇప్పటివరకు బాలయ్య అర్జునుడు, శ్రీహరి భీముడు, సౌందర్య ద్రౌపది క్యారెక్టర్ల లుక్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.
గురువారం సాయంత్రం ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బాలయ్య ఎప్పటిలానే తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. శ్రీహరి, సౌందర్య పాత్రలకు ఇతరులు డబ్బింగ్ చెప్పారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.
దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా విజయదశమి సందర్భంగా NBK Theatre లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24 ఉదయం విడుదల చేయబోతున్నారు. టికెట్ ధర రూ.50 గా నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించడంతో అభిమానులు, ప్రేక్షకులనుంచి మంచి స్పందన లభిస్తోంది.