Bimbisara: బింబిసారా నుండి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసారా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన...

Nandamuri Kalyan Ram Bimbisara First Single Annnouncement
Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసారా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను భారీ విజువల్ వండర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’లో ఎన్టీఆర్.. జోష్ లో నందమూరి అభిమానులు..
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్‌ను అందించింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను రేపు చేయబోతున్నారట బింబిసారా చిత్ర యూనిట్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, ఆయన నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
కాగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన అందాల భామలు సంయుక్తా మీనన్, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి రేపు ఈ సినిమా నుండి ఎలాంటి సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తారా అని చిత్ర వర్గాలు, ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నాయి.
After the Blockbuster #BimbisaraTrailer, dropping the First Single soon ??
Announcement Tomorrow ?#Bimbisara#BimbisaraOnAugust5th @NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @saregamasouth pic.twitter.com/hu3jhdm5cd
— NTR Arts (@NTRArtsOfficial) July 10, 2022