Arjun Son Of Vyjayanthi : కళ్యాణ్ రామ్ – విజయశాంతి సినిమా.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ వచ్చేసింది.. లేడీ సూపర్ స్టార్ రిటర్న్..

మీరు కూడా అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ చూసేయండి..

Nandamuri Kalyan Ram Vijayashanti Arjun Son Of Vyjayanthi Teaser Released

Arjun Son Of Vyjayanthi : కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. విజయశాంతి తనయుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.

Also Read : Sai Rajesh : ఆ సినిమాకి చెత్త మిస్టేక్ అదే.. నాని సినిమాని పొగుడుతూనే ఒక్క విషయంలో తిట్టిన బేబీ డైరెక్టర్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ చూసేయండి..

టీజర్ చూస్తుంటే.. విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది. అనుకోకుండా కొన్ని గొడవల్లో హీరో దిగడంతో తల్లి – కొడుకుల పోరులా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్ళీ కొన్నేళ్ల తర్వాత పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. విజయశాంతి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ పండగే.