Sai Rajesh : ఆ సినిమాకి చెత్త మిస్టేక్ అదే.. నాని సినిమాని పొగుడుతూనే ఒక్క విషయంలో తిట్టిన బేబీ డైరెక్టర్..

తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కోర్ట్ సినిమాని అభినందిస్తూనే ఒక విషయంలో మాత్రం విమర్శిస్తూ పోస్ట్ చేసాడు.

Sai Rajesh : ఆ సినిమాకి చెత్త మిస్టేక్ అదే.. నాని సినిమాని పొగుడుతూనే ఒక్క విషయంలో తిట్టిన బేబీ డైరెక్టర్..

Baby Director Sai Rajesh Post on Nani Priyadarshi Court Movie

Updated On : March 17, 2025 / 10:10 AM IST

Sai Rajesh : నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా నుంచి ఇటీవల ప్రియదర్శి మెయిన్ లీడ్ లో కోర్ట్ అనే సినిమా రిలీజయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ పెద్ద విజయం సాధించింది. మూడు రోజుల్లోనే కోర్ట్ సినిమా ఏకంగా 24 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పెద్ద హిట్ అయింది. సినిమాలో అన్ని పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. శివాజీ అయితే నట విశ్వరూపం చూపించాడు. పోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తూనే మంచి స్క్రీన్ ప్లేతో కోర్ట్ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే కోర్ట్ సినిమాని అభినందిస్తూ ప్రేక్షకులతో పాటు అనేకమంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కోర్ట్ సినిమాని అభినందిస్తూనే ఒక విషయంలో మాత్రం విమర్శిస్తూ పోస్ట్ చేసాడు.

Also Read : Vishwak Sen : హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ.. ఏం ఎత్తుకెళ్లారు, వాటి విలువ ఎంతంటే..

కోర్ట్ సినిమా చూసిన సాయి రాజేష్ తన సోషల్ మీడియాలో.. ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని, 18 ఏళ్లు నిండిన ఒక అబ్బాయి తన ఇష్టపూర్వకంగా ముట్టుకుంటే, ఒక లాయర్ ఆ కేసు తీసుకొని ఏం చేశాడు అనే థియేట్రికల్ ట్రైలర్ చూసాక, మొదటి ఫ్రేమ్ నుంచి థియేటర్ లో కూర్చున్న వాడిని కూర్చోబెట్టాలి అంటే ఆ స్క్రీన్ ప్లే ఎంత గొప్పదై వుండాలి, వాడు ఎంత గొప్ప దర్శకుడై వుండాలి.. సినిమా అయ్యాక ఎక్కడో ఏదో సంతోషం, సంతృప్తి. ఇది మన సినిమా అనే గర్వం, అసలు 1st హాఫ్ లో ఆ ప్రేమ కథ చూస్తుంటే అందులో విజయ్ బుల్గానిన్ విశ్వరూపం, ఆ పిల్లలిద్దరూ act చేస్తున్న విధానం చూస్తే.. హీరోయిన్ కి ఒక నీచుడైన తండ్రో, మామో, బాబాయో ఉంటె తెలుగు సినిమాల్లో ఎలా ఓపెన్ చెయ్యాలో బేసిక్స్ మర్చిపోయి ఒక్క రౌడీ, రక్తపు చుక్క, హత్య లేకుండా నిజ జీవితంలో మన మధ్యే తిరిగే ఒక పాత్ర ని సృష్టించి అందులో శివాజీ చేత గొప్పగా పలికించిన తీరుకి.. కొత్త దర్శకుకులకి, కొత్త కథలకి ఒక హీరో మిగిలి వున్నాడు. తెర మీద, బయట “ప్రియదర్శి” అదరగొట్టాడు. హర్షవర్ధన్ ని వాడుకోవటం మొదలయింది. మంచి పరిణామం.. చివరి కోర్టు సీన్లో ఒక్కో మాట వడ కాచి చూసినా ఒక్క తప్పు దొర్లని ఎన్నో గొప్ప మాటలు సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో చప్పట్లు కొట్టేలా చెప్పాడు.

ఈ సినిమా కి ఏదైనా ఒక చెత్త మిస్టేక్ జరిగింది అంటే.. అది ఆ టైటిల్ “కోర్టు” అని పెట్టడమే. పది కాలాల పాటు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఇంకేదో పెట్టుకోవాల్సింది. నాకు తెలుసు :చాలా మందిని మర్చిపోయుంటా అని అన్ని మంచి పాత్రలు, అంత మంచి టెక్నిషియన్స్.. తెలుగు సినిమా చచ్చిపోతుంది అని రోజు చచ్చిపోయే గిలక్కోళ్లు గాళ్లు ఎంత ప్రమోట్ చేస్తున్నారో తెలీదు కానీ, ఇది ఒక Ray of హోప్. ఇలాంటి కథలకి, ఇంత చిన్న బడ్జెట్ సినిమాలకి 6-7 కోట్ల ఓపెనింగ్, 50 కోట్ల పైన వసూళ్ల అంచనా అంటే కొత్త కొత్త రచయితలు, దర్శకులు వస్తారు, కొత్త నీరు వస్తుంది. నమ్మకం లేనిదల్లా, వీళ్ళని నమ్మి నిలబడే మనిషి.. ఇంత మంచి టెక్నీషియన్స్ ని, కథలని గుర్తించగలిగే ఒక మనసు “నాని”. క్లాసిక్ ఇది.. థియేటర్ లోనే చూడండి అంటూ రాసుకొచ్చాడు. దీంతో సాయి రాజేష్ పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : Samantha: మళ్లీ ఏమైంది సామ్‌? ఆసుపత్రిలో సమంత.. ఫొటో వైరల్