Samantha: మళ్లీ ఏమైంది సామ్? ఆసుపత్రిలో సమంత.. ఫొటో వైరల్
సమంత చాలాకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతోంది.

Samantha
హీరోయిన్ సమంత ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆసుపత్రిలో సమంత బెడ్‌పై పడుకుని సెలైన్ ఎక్కించుకుంటుండగా తీసిన ఫొటో ఇది. దీంతో సమంత ఆరోగ్యంపై అభిమానులు మళ్లీ చర్చించుకుంటున్నారు.
ఇటీవల పలు కార్యక్రమాల్లో సమంత హుషారుగానే కనపడింది. అయితే, ఆమె ఒక్కసారిగా ఆసుపత్రిలో బెడ్‌పై పడుకున్న ఫొటో పోస్ట్ చేసింది. మళ్లీ ఏమైంది సామ్? అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. సమంత అరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని ఆరా తీస్తున్నారు.
సమంత చాలాకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతోంది. దాని నుంచి బయటపడడానికి చికిత్స తీసుకుంటోంది. వ్యాయామాలు చేస్తూ, డైట్ వంటివి పాటిస్తోంది. ఇప్పటికే సమంత సినిమాలు తగ్గించింది. ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌తో ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ మూవీలో నటిస్తోంది. ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన విషయం విదితమే. ఆ సంస్థలో మొట్టమొదటి సినిమా “శుభం” నిర్మాణం సక్సెస్‌ఫుల్ పూర్తయినట్లు సామ్ ఇప్పటికే తెలిపింది. ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ సమంత బెడ్‌పై పడుకుని ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేయడం గమనార్హం. సమంత పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
View this post on Instagram