Vishwak Sen : హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ.. ఏం ఎత్తుకెళ్లారు, వాటి విలువ ఎంతంటే..
సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.

Vishwak Sen : సినీ హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉంటున్న విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో దొంగలు పడ్డారు. రెండు డైమండ్ రింగ్స్ దొంగలించారు. వీటి విలువ 2 లక్షలకుపైనే ఉంటుందన్నారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లి క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై తెల్లవారుజామున వచ్చి ఇంటి ముందు బైక్ ను పార్క్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతడు గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకి వెళ్లి వెనక డోర్ నుంచి బెడ్ రూమ్ లోకి చొరబడి డైమండ్ రింగ్స్ ను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read : వామ్మో.. హైదరాబాద్‌లో రద్దయిన పాత నోట్ల కలకలం.. రూ.55లక్షల విలువైన కరెన్సీ నోట్లు స్వాధీనం..
సరిగ్గా 20 నిమిషాల్లోనే దొంగిలించిన రింగ్స్ తో దొంగ బయటకు వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.