Kalyan Ram: డెవిల్ షూటింగ్‌ను ముగించేసిన కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ మూవీ షూటింగ్ ను ముగించుకుంది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Nandamuri Kalyan Ram Wraps Up Devil Movie Shooting
Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Kalyan Ram : రామ్‌చరణ్ అంటే నాకు గుర్తుకు వచ్చేది అదే.. కళ్యాణ్ రామ్!
ఇక ఈ సినిమాను దర్శకుడు నవీన్ మేడారం తెరకెక్కిస్తుండగా, స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా చిత్ర యూనిట్ ముగించేసింది. కళ్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా చివరి షెడ్యూల్‌లో పాల్గొన్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సాంగ్ కోసం భారీ సెట్!
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కూడా పాన్ ఇండియా హీరో అవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా పనులను వీలైనంత త్వరగా ముగించేసి సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.