నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్స్ చూశారా? బాలయ్యతో కలిసి పెళ్ళిలో..

నాన్న బాలకృష్ణతో కలిసి మోక్షజ్ఞ నేడు ఉదయం విశాఖపట్నం టీడీపీ నేత మతుకుమిల్లి భరత్ సోదరుని వివాహానికి హాజరయ్యాడు.

Nandamuri Mokshagna : నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నందమూరి వారసుడు, బాలకృష్ణ(Balakrishna) తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు అడుగుతూనే ఉన్నారు. త్వరలో అంటూ బాలయ్య కూడా పలుమార్లు చెప్పినా ఇప్పటికి మోక్షజ్ఞ ఎంట్రీపై అధికారిక ప్రకటన రాలేదు.

కానీ మోక్షజ్ఞ బయట మీడియాకు కనిపిస్తే మాత్రం కచ్చితంగా వైరల్ అవుతాడు. చాలా రేర్ గా మోక్షజ్ఞ బయట కనిపిస్తాడు. గత సంవత్సరం తెలంగాణ ఎన్నికల సమయంలో మోక్షజ్ఞ మీడియా కంటపడ్డాడు. అంతకుముందు కొంచెం బొద్దుగా ఉండే మోక్షజ్ఞ ఆ తర్వాత సన్నబడ్డాడు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సిద్దమవుతున్నాడు అని వార్తలు వచ్చాయి. అప్పట్నుంచి మళ్ళీ బయట కనపడని మోక్షజ్ఞ తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాడు.

Also Read : హీరోలుగా మారిన ఇద్దరు కమెడియన్లు.. ఒకే రోజు తమ సినిమాలతో..

నాన్న బాలకృష్ణతో కలిసి మోక్షజ్ఞ నేడు ఉదయం విశాఖపట్నం టీడీపీ నేత మతుకుమిల్లి భరత్ సోదరుని వివాహానికి హాజరయ్యాడు. పెళ్ళిలో తండ్రితో కలిసి సందడి చేసాడు. ఈ పెళ్ళికి పలువురు టీడీపీ నేతలు రాగా మోక్షజ్ఞ కనపడటంతో అతనితో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం ఇంకెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు, మోక్షజ్ఞ కోసం వెయిటింగ్ అని అడుగుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు