Harsha – Abhinav : హీరోలుగా మారిన ఇద్దరు కమెడియన్లు.. ఒకే రోజు తమ సినిమాలతో..

తాజాగా ఇద్దరు కమెడియన్లు హీరోలుగా మారి తమ సినిమాలని ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు.

Harsha – Abhinav : హీరోలుగా మారిన ఇద్దరు కమెడియన్లు.. ఒకే రోజు తమ సినిమాలతో..

Tollywood Comedians Viva Harsha Abhinav Gomatam turned as Heros coming on same day with their Movies

Updated On : February 22, 2024 / 1:13 PM IST

Viva Harsha – Abhinav Gomatam : గతంలో బ్రహ్మానందం, అలీ, సునీల్.. లాంటి స్టార్ కమెడియన్స్ మెయిన్ లీడ్స్ లో హీరోలుగా సినిమాలు చేశారు. ఆ తర్వాత ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా చాలా మంది కమెడియన్స్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. తాజాగా ఇద్దరు కమెడియన్లు హీరోలుగా మారి తమ సినిమాలని ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు.

వైవా షార్ట్ ఫిలింతో మంచి పేరు తెచ్చుకున్న వైవా హర్ష ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులతో పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ ఉన్న వైవా హర్ష ఇప్పుడు హీరోగా మారి ‘సుందరం మాస్టర్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే సుందరం మాస్టర్ టీజర్, ట్రైలర్స్ తో మంచి అంచనాలు నెలకొల్పింది. కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని మాస్ మహారాజ రవితేజ నిర్మించారు. సుందరం మాస్టర్ సినిమా రేపు ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతుంది.

 

ఈ నగరానికి ఏమైంది సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభినవ్ గోమఠం. కమెడియన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అభినవ్. తాజాగా అభినవ్ హీరోగా ‘మస్తు షేడ్స్ ఉన్నాయిరా’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతుంది. దీంతో ఇద్దరు కమెడియన్స్ హీరోలుగా మారి ఒకేరోజు వస్తుండటంతో ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సైతం ఈ సినిమాలపై ఆసక్తి చూపిస్తుంది. మరి మెయిన్ లీడ్స్ లో ఈ ఇద్దరు నటులు ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.

 

Also Read : Samantha : సమంతకు ఏజ్ కేవలం 23 ఏళ్ళే.. సీక్రెట్ షేర్ చేసిన సమంత.. ఎలా అంటే?

ఇక ఫిబ్రవరి 23న ఈ రెండు సినిమాలతో పాటు ముఖ్య గమనిక, భ్రమయుగం తెలుగు డబ్బింగ్, సిద్దార్థ రాయ్, సైరన్ తెలుగు డబ్బింగ్, వ్యూహం సినిమాలు రిలీజ్ కానున్నాయి.