Nandamuri Mokshagna : ఫస్ట్ సినిమా మొదలవ్వకుండానే రెండో సినిమా ఓకే చేసిన మోక్షజ్ఞ.. ఇటీవలే పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్‌తో..

మోక్షజ్ఞ మొదటి సినిమా మొదలవ్వకుండానే రెండో సినిమాకు కూడా సైన్ చేసేశాడని తెలుస్తుంది.

Nandamuri Mokshagna : ఫస్ట్ సినిమా మొదలవ్వకుండానే రెండో సినిమా ఓకే చేసిన మోక్షజ్ఞ.. ఇటీవలే పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్‌తో..

Nandamuri Mokshagna

Updated On : December 2, 2024 / 2:18 PM IST

Nandamuri Mokshagna : బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఇటీవలే తన మొదటి సినిమా అనౌన్స్ చేసాడు. ఎన్నో ఏళ్ళ బాలయ్య అభిమానుల నిరీక్షణ త్వరలోనే తీరనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షజ్ఞ మొదటి సినిమాని ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తవ్వగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుందని తెలుస్తుంది. డిసెంబర్ 5న మోక్షజ్ఞ మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది సమాచారం.

అయితే మోక్షజ్ఞ మొదటి సినిమా మొదలవ్వకుండానే రెండో సినిమాకు కూడా సైన్ చేసేశాడని తెలుస్తుంది. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : RGV : అప్పటివరకు ఆర్జీవీని అరెస్ట్ చెయ్యొద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు..

సితార ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నెక్స్ట్ సినిమా తమ నిర్మాణంలోనే ఉంటుందని ప్రకటించారు. బాలయ్య సంక్రాంతికి రాబోతున్న డాకు మహారాజ్ సినిమాని కూడా వీళ్ళే తెరకెక్కిస్తున్నారు. బాలయ్యతో ఈ నిర్మాణ సంస్థకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ రెండో సినిమా లాక్ చేసినట్టు తెలుస్తుంది.