RGV : అప్పటివరకు ఆర్జీవీని అరెస్ట్ చెయ్యొద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు..
ఆర్జీవీ తనని అరెస్ట్ చేయొద్దంటూ, ట్విట్టర్ పోస్టుల విషయంలో తనని విచారించవద్దంటూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

AP High Court Orders in RGV Social Media Case Issue
RGV : గతంలో ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన ట్విట్టర్ పోస్టులపై ఇటీవల కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు ఆర్జీవీని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఆర్జీవీ పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. వీడియోలు, ఇంటర్వ్యూల రూపంలో మాత్రం తనని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నాడు.
అయితే ఆర్జీవీ తనని అరెస్ట్ చేయొద్దంటూ, ట్విట్టర్ పోస్టుల విషయంలో తనని విచారించవద్దంటూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తాజాగా ఏపీ హైకోర్టు ఆర్జీవీ పిటిషన్ ని విచారించి ఆదేశాలు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. వచ్చే సోమవారం వరకు ఆర్జీవీని అరెస్ట్ చెయ్యొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో వర్మ పిటిషన్ పై హైకోర్టు ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.
Also Read : Pushpa 2 : లండన్ లో పుష్ప హవా.. లండన్ వీధుల్లో బన్ని ఫ్యాన్స్ డ్యాన్స్..
దీంతో ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆర్జీవికి ఊరటనిచ్చాయి. మరి ఈ వారం రోజుల తర్వాత ఆర్జీవీని అరెస్ట్ చేస్తారా? మళ్ళీ ఆర్జీవీ కోర్ట్ బాట పడతాడా చూడాలి.