Nandu : నందు, అవికా గోర్ కాంబినేషన్లో కొత్త సినిమా..

ఇటీవల తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది అవికా గోర్. తాజాగా నందు కొత్త సినిమాలో కూడా అవికా హీరోయిన్ గా నటించబోతుంది. నందు, అవికా గోర్ జంటగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా లక్కీ మీడియా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Nandu : నందు, అవికా గోర్ కాంబినేషన్లో కొత్త సినిమా..

Nandu and Avika Gor combination new movie under Lucky Media

Updated On : July 22, 2023 / 12:19 PM IST

Nandu Avika Gor : యాక్టర్ నందు ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా కూడా పలు సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇటీవల హీరోగా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు నందు. ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలి అనాలి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు. తాజాగా నందు కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Producer SKN : రోజూ ట్రోల్స్.. సోషల్ మీడియాలో వైరల్.. కానీ SKN కష్టాల గురించి మీకు తెలుసా?

ఇటీవల తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది అవికా గోర్. తాజాగా నందు కొత్త సినిమాలో కూడా అవికా హీరోయిన్ గా నటించబోతుంది. నందు, అవికా గోర్ జంటగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా లక్కీ మీడియా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నందు, అవికాలపై క్లాప్ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది.

View this post on Instagram

A post shared by @that_actor_nandu