Ugly Story OTT: 14 రోజులకే ఓటీటీలోకి వచ్చిన సైకో ప్రేమకథ.. భార్యని ఎంత టార్చర్ పెడతాడో..
థియేటర్స్ లో రిలీజయిన 14 రోజులకే ఓటీటీలోకి రావడం గమనార్హం.(Ugly Story)
Nandu Avika Gor Ugly Story OTT Streaming
Ugly Story : నందు, అవికా గోర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘అగ్లీ స్టోరీ’. ఓ సైకో ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కింది. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాణంలో ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల మే 22 న థియేటర్స్ లో రిలీజయింది. థియేటర్స్ లో ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
ఇప్పుడు ఈ అగ్లీ స్టోరీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్స్ లో రిలీజయిన 14 రోజులకే ఓటీటీలోకి రావడం గమనార్హం. అగ్లీ స్టోరీ సినిమా నేడు జూన్ 5 నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ, కథనం పరంగా మెప్పించకపోయినా నందు మాత్రం సైకో భర్త, ప్రేమికుడు పాత్రలో నటన అదరగొట్టాడు.
Also Read – Trisha Vijay : త్రిషకు నో చెప్పిన విజయ్.. త్రిష ప్లేస్ లో ఆ డ్యాన్స్ మాస్టర్..?
ఈ అగ్లీ స్టోరీ కథ విషయానికొస్తే.. కార్తీక్(నందు)-నేహా(అవికా గోర్)భార్యాభర్తలు. నేహా ఇష్టంలేకుండానే ఈ పెళ్లి చేసుకొని కార్తీక్ పెట్టె టార్చర్ మౌనంగా భరిస్తూ ఉంటుంది. కార్తీక్ నేహాని బాగా ఇష్టపడ్డాడు కానీ తనకే దక్కాలి, తాను చెప్పిందే చేయాలి అనే సైకోయిజంతో నేహాని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆమె గతంలో ఉన్న ప్రేమ గౌతమ్(రవి మహాదాస్యం)ని గుర్తుచేస్తూ నేహాని టార్చర్ పెడుతూ సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు కార్తీక్. ఓ రోజు సడెన్ గా నేహా కనిపించకుండా పోతుంది. అసలు నేహా ఎక్కడికి వెళ్ళింది? కార్తీక్ అంత టార్చర్ చేస్తున్నా నేహా ఎందుకు భరిస్తుంది? నేహా గత ప్రేమకథ ఏంటి? నేహాకు ఇష్టంలేకపోయినా కార్తీక్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. గౌతమ్ మళ్ళీ తిరిగొస్తాడా.. ఇవన్నీ తెలియాలంటే అగ్లీ స్టోరీ సినిమా చూడాల్సిందే..
