nani
Nani : ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనని తాను ఒక స్టార్ గా మలుచుకున్న హీరో ‘నాని’. చిరంజీవి, రవితేజల తరువాత ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చింది ఎవరు అంటే మొదట వినిపించే పేరు నాని. తన నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ చేత నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. కాగా నేడు (ఫిబ్రవరి 24) నాని బర్త్ డే. దీంతో సోషల్ మీడియా వేదికగా నేచురల్ స్టార్ కు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాడు. అయితే తన బర్త్ డే గురించి నాని వేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Dasara Movie: దసరా నుండి నాని మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
”1984 లో నేను ఫిబ్రవరి 24 అంటే శుక్రవారం రిలీజ్ అయ్యాను. గత 15 ఏళ్లగా నేను మళ్ళీ మళ్ళీ శుక్రవారం పుడుతూనే ఉన్నాను. ప్రతి శుక్రవారం నన్ను మళ్ళీ మళ్ళీ జన్మించేలా చేస్తున్న మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. కాగా ప్రస్తుతం నాని దసరా సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నాని రా అండ్ రస్టిక్ గా కనిపించబోతున్నాడు. పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లు, సాంగ్ లు, గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలు మరెంత పెంచేసింది. ఇక చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
I was a Friday release on 24th feb, 1984
Last 15 years I was born again and again on so many Friday’s 🙂
This Friday all I have is gratitude for all your love and I look forward to celebrating many more together ♥️
— Nani (@NameisNani) February 24, 2023