Dasara Movie: దసరా నుండి నాని మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని పాత్ర ఊరమాస్‌గా ఉండనుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Dasara Movie: దసరా నుండి నాని మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

Nani Interesting Post From Dasara Movie

Updated On : February 12, 2023 / 8:46 PM IST

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని పాత్ర ఊరమాస్‌గా ఉండనుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Dasara Movie: వాలెంటైన్స్ డే రోజున ‘ఓరి వారి’ అంటూ బ్రేకప్ సాంగ్ పట్టుకొస్తున్నా నాని!

ఇక ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘ఓరి వారి’ అంటూ సాగే ఈ బ్రేకప్ సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేయనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ పాటను సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసి స్వయంగా పాడాడు. ఇక తాజాగా ఈ పాటకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను నాని షేర్ చేశాడు.

Dasara Teaser: దసరా టీజర్.. రస్టిక్ కాదు.. అంతకు మించిపోయిన నాని!

ఈ పాటకు సంబంధించి సంతోష్ నారాయణన్ తెరపై కూడా కనిపించనున్నాడని.. ప్రేక్షకులకు ఇది కూడా బాగా నచ్చుతుందని నాని అన్నాడు. ఇక ఈ సాంగ్‌ను రేపు రిలీజ్ చేస్తుండగా, ప్రేక్షకులు ఈ సాంగ్‌ను తెగ లైక్ చేయడం ఖాయమని ఆయన అంటున్నాడు. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మార్చి 30న దసరా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.