Nani : నాని సరికొత్త రికార్డ్.. అమెరికాలో మహేష్ తర్వాత నానినే.. స్టార్స్ అంతా నాని వెనకాలే..

అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రావాలని స్టార్ హీరోల అభిమానులు కూడా కోరుకుంటారు. అయితే ఇటీవల ఈ 1 మిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ కొంచెం ఫేమ్ ఉన్న స్టార్స్ కి, హైప్ ఉన్న సినిమాలకు వస్తున్నాయి.

Nani Creates New Record in America for his Movies Collections

Nani : మన ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ గ్రాండ్ గా రిలీజ్ అయినట్టే మన స్టార్ హీరోల సినిమాలు అమెరికాలో కూడా గ్రాండ్ గా రిలీజవుతాయి. అక్కడ కూడా మన సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. మన హీరోలు అక్కడ కూడా రికార్డులు సెట్ చేస్తారు కలెక్షన్స్ లో. అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చినట్టే.

అమెరికాలో(America) 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రావాలని స్టార్ హీరోల అభిమానులు కూడా కోరుకుంటారు. అయితే ఇటీవల ఈ 1 మిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ కొంచెం ఫేమ్ ఉన్న స్టార్స్ కి, హైప్ ఉన్న సినిమాలకు వస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో ఎక్కువ 1 మిలియన్ డాలర్ సినిమాలు సాధించిన హీరో మహేష్ బాబు. ఏకంగా మహేష్ బాబు 11 సినిమాలకు 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అందులో 1 మిలియన్ కంటే ఎక్కువగా వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి.

మహేష్ బాబు తర్వాత నానినే ఆ లిస్ట్ లో ఉన్నారు. నానికి మొన్నటి వరకు 8 సినిమాలు ఉండగా తాజాగా రిలీజయిన హాయ్ నాన్న సినిమా కూడా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడంతో నాని ఇప్పటివరకు మొత్తం 9 సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. నాని తర్వాతే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్ వరుస స్థానాల్లో ఉన్నారు.

Also Read : Naa Saami Ranga : ‘నా సామి రంగ’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అంటున్న నాగార్జున..

దీంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా 9వ సినిమా కూడా నాని అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు హాయ్ నాన్న చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే మహేష్ గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి సినిమాకు చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నాని వరుసగా నాలుగైదు సినిమాలు చేసి ఈ రికార్డులో మహేష్ ని దాటేయొచ్చు అని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాని ప్రస్తుతం హాయ్ నాన్న సక్సెస్ ప్రమోషన్స్ లో అమెరికాలో సందడి చేస్తున్నారు.