Nani Deepika Rangaraju new Chilli Powder Ad goes Viral
Nani – Deepika Rangaraju : మన సెలబ్రిటీలు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క టీవీ షోలు, యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతని మన సెలబ్రిటీలు బాగా ఫాలో అయి డబ్బులు సంపాదిస్తారు. ఇప్పటికే పలు యాడ్స్ తో మెప్పించిన హీరో నాని మరో కొత్త యాడ్ చేసారు.
నానితో పాటు బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న దీపిక రంగరాజు కూడా ఈ యాడ్ లో నటించింది. ఇది ఓ కారం పొడి యాడ్. ఈ యాడ్ లో దీపిక నానిని అన్న అని పిలుస్తుంది. ప్రస్తుతం టీవీ షోలతో, సీరియల్ తో ఫుల్ పాపులర్ లో ఉన్న దీపిక నానితో కలిసి ఈ యాడ్ చేయడంతో ఇది కూడా వైరల్ గా మారింది. నాని – దీపిక రంగరాజు చేసిన యాడ్ మీరు కూడా చూసేయండి..
దీపిక కూడా నానితో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.