Nani : OG దర్శకుడితో నాని సినిమా.. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో..

పవన్ కళ్యాణ్ 'OG' దర్శకుడితో నాని మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో సినిమా.

Nani mafia based movie with Pawan Kalyan OG director sujith reddy

Nani : నేచురల్ స్టార్ నాని వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో ‘అంటే సుందరానికి’ ఫేమ్ వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ మూవీ తరువాత డివివి, దిల్ రాజు బ్యానర్స్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కి సిద్దమవుతున్నారట. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని డివివినే నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఇదే బ్యానర్ లో మరో మూవీకి కూడా నాని సైన్ చేశారట.

ఆ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ దర్శకుడు ప్రస్తుతం డివివి నిర్మాణంలోనే పవన్ కళ్యాణ్ ‘OG’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తరువాత సుజిత్.. నానితో సినిమా చేయడానికి సిద్దమవుతున్నారట. ఆల్రెడీ కథ కూడా లాక్ అయ్యిందట. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఆ సినిమా సాగబోతుందంటూ సమాచారం. నాని నుంచి ఇప్పటి వరకు ఆ జోనర్ సినిమా రాలేదు.

Also read : Saripodhaa Sanivaaram : పుష్పకి పోటీగా నాని.. ఆగస్టులో ‘సరిపోదా శనివారం’ రిలీజ్..!

మరి మాఫియా డాన్ గా నాని ఎలా కనిపించబోతున్నారో చూడాలి. అలాగే నాని లైనప్ లో ఉన్న మిగిలిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. ‘బలగం’ ఫేమ్ వేణు, ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ నానితో సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నారు. వేణు-నాని సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నారని సమాచారం. ఇక నాని ఫ్యాన్స్ అంతా.. దసరాతో నానికి 100 కోట్ల సినిమాని ఇచ్చిన శ్రీకాంత్ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే శైలేష్ కొలనుతో హిట్ 3 కూడా లైన్ లో ఉంది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సరిపోదా శనివారం’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా చిత్రీకరణని జూన్, జులై నాటికీ పూర్తీ చేసి.. ఆగష్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 15కి పుష్ప 2 రిలీజ్ కాకుంటే.. ఆ తేదికి రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. కాగా ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంటే, ఎస్ జె సూర్య విలన్ గా కనిపించబోతున్నారు.